తమిళనాడులోని Sivaganga జిల్లాకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీ తన నిజాయితీతో ప్రశంసలు అందుకుంది. చెత్తలో రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికినప్పటికీ వాటిని దాచుకోకుండా పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించింది.
పిల్లలు పొరపాటున పడేసిన ఈ నగలు తిరిగి లభించడంతో ఆనందించిన యజమానులు సెల్వీకి రూ.20 వేల నగదు బహుమతిగా అందజేశారు. గతంలోనూ ఇక్కడి పారిశుద్ధ్య కార్మికులు తమ నిజాయితీని చాటుకున్న ఘటనలు ఉండటం విశేషం.
