టాలెంటెడ్ నటి శోభితా ధూళిపాళ్ల లీడ్ రోల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా ‘చీకటిలో’ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) విడుదల కానుంది. ఉత్కంఠభరితమైన సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇందులో శోభితా ధూళిపాళ్ల ‘సంధ్య’ అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ (True Crime Podcaster) పాత్రలో కనిపిస్తారు. సమాజంలో జరిగే రహస్య నేరాలను వెలికితీస్తూ ఆమె చేసే ప్రయాణం, ఆ క్రమంలో ఎదురయ్యే ప్రమాదాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఇదొక ‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్’ క్రైమ్ సస్పెన్స్ అని, ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మలుపులతో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు. అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత శోభితా నటిస్తున్న క్రైమ్ డ్రామా కావడంతో దీనిపై సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
