100 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికిన సైబర్ మోసగాళ్లు
Cyberabad Cybercrime Police కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
హైదరాబాద్: Hyderabad మరో పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. గౌలిదొడ్డికి చెందిన ఓ software engineer, SEBI గుర్తింపు పొందిన స్టాక్ మార్కెట్ అనలిస్టులమంటూ పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తుల మాటలు నమ్మి రూ.37 లక్షలకు పైగా కోల్పోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితుడు 2022 నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బిలాల్, మయాంక్ అని పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు అతనికి ఫోన్ చేశారు.
తాము SEBI అధీకృత మార్కెట్ అనలిస్టులమని చెప్పిన వారు, తమ సూచనల మేరకు పెట్టుబడులు పెడితే 100 శాతం లాభాలు వస్తాయని హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మిన బాధితుడు, వారు సూచించిన షేర్లలో రూ.37 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు.
అయితే ఆ పెట్టుబడులన్నీ భారీ నష్టాల్లోకి వెళ్లడంతో బాధితుడు పెట్టిన మొత్తం దాదాపు పూర్తిగా కోల్పోయాడు.
దీంతో బాధితుడు ( software engineer ) వారిని ప్రశ్నించగా, స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాలకు తమకు ఎలాంటి బాధ్యత లేదని వారు చెప్పినట్లు సమాచారం.
తనను SEBI గుర్తింపు పొందిన సలహాదారుల పేరుతో మోసం చేశారని అనుమానం వచ్చిన బాధితుడు, Cyberabad Cybercrime Policeకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పెట్టుబడి మోసంపై దర్యాప్తు చేస్తున్నారు.



