IPL 2026లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. Sunrisers Hyderabad మరియు Delhi Capitals జట్లు ఉప్పల్‌లోని Rajiv Gandhi International Cricket Stadiumలో సాయంత్రం 7:30 గంటలకు తలపడనున్నాయి.

హోం గ్రౌండ్లో వరుసగా రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు మీద ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన SRH, మూడు విజయాలు సాధించింది.బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీష్, అనికేత్ కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్‌తో పాటు మిడిల్ ఆర్డర్ మెరుగ్గా రాణిస్తే భారీ స్కోర్ నమోదు చేసే అవకాశముందని జట్టు భావిస్తోంది.బౌలింగ్ విభాగంలో ప్రారంభంలో కాస్త నిరాశపరిచిన SRH, యువ బౌలర్లతో గత రెండు మ్యాచ్‌ల్లో పుంజుకుంది. ప్రఫుల్, షాకిబ్, శివాంగ్, ఈశాన్ మలింగ, నితీష్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.ఇక Delhi Capitals ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. గత మ్యాచ్‌లో RCBపై గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది.మ్యాచ్ సందర్భంగా అభిమానుల రాకపోకలకు అనుగుణంగా నగరంలో మెట్రో సేవలను అర్ధరాత్రి వరకు కొనసాగించనున్నారు.
