పాముకాటుతో వివాహిత మృతి.. శ్రీకాకుళంలో విషాదం

March 11, 2026 9:54 AM

Srikakulam districtలో విషాద ఘటన చోటుచేసుకుంది. Narasannapeta మండలం బొరిగివలస గ్రామానికి చెందిన ఇప్పిలి నేలవేణి అనే వివాహిత పాముకాటుకు గురై మృతి చెందారు.

మంగళవారం సాయంత్రం పొలంలో సోడి పంట కోస్తున్న సమయంలో ఆమెను పాము కాటేసింది. దీంతో అస్వస్థతకు గురైన నేలవేణిని స్థానికులు వెంటనే నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. నేలవేణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media