శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలు పరాకాష్టకు చేరాయి. బుధవారం వంశధార నదీ తీరాన చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా జరిగింది.
ఉదయం 11:30 గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధిష్టింపజేసి, వేదమంత్రాల నడుమ మిరియాబెల్లి రేవుకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ‘శివోహం’ నినాదాలతో వంశధార తీరం ప్రతిధ్వనించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఒడిశా, ఏపీలోని వివిధ జిల్లాల నుండి భక్తులు తరలిరావడంతో కిలోమీటర్ల మేర జనజాతర కనిపించింది.

