విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు అద్భుతమైన వేదికలని మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్లోని శ్రీనిధి హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన ‘సైన్స్ ఫెయిర్’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ఆవిష్కరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంజుల రఘునాథ్ రెడ్డి ప్రతి స్టాల్ను సందర్శించి, ప్రాజెక్టుల పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని, పుస్తక జ్ఞానంతో పాటు ప్రయోగాత్మక విద్యపై దృష్టి సారించినప్పుడే పరిశోధనా తత్వం పెరుగుతుందని తెలిపారు.
చిన్నారులు తమ ప్రాజెక్టుల గురించి ఆత్మవిశ్వాసంతో వివరించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
