శ్రీశైలం ప్రాజెక్టులో నీటి కొరత.. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

March 31, 2026 1:53 PM

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 824 అడుగులకు పడిపోయి, మొత్తం నీటి నిల్వలు సుమారు 44 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నీటి కొరత కారణంగా శ్రీశైలం కుడి మరియు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. నీటి నిల్వలు పెరిగిన తరువాతే మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media