సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ చిత్రం ‘గ్లోబ్ ట్రాటర్’ నుంచి మరో భారీ అప్డేట్ వెలువడింది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో విడుదల చేశారు.
“And now she arrives… Meet Mandakini” అనే క్యాప్షన్‌తో వచ్చిన పోస్టర్లో ప్రియాంక చోప్రా చీరకట్టులో, హీల్స్ ధరించి, చేతిలో పిస్టల్‌తో పవర్ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చారు.
ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల్లో సినిమా పై అంచనాలను మరింత పెంచింది. ‘RRR’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆసక్తి నెలకొంది.

తరువాత మళ్ళి మహేష్ బాబు ట్వీట్ తో ఇంకా సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ కి తెర తీశారు
