దేశంలో పెరుగుతున్న వీధికుక్కల దాడులు మరియు రోడ్లపై పశువుల వల్ల జరిగే ప్రమాదాలు నేపథ్యంలో, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ ఆదేశాలను జారీ చేసింది.రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాంగణాలను వీధికుక్కల రహితంగా చేయాలి. అధికారులు జాయింట్ డ్రైవ్ నిర్వహించి కుక్కలను పట్టుకోవాలి.పట్టుకున్న కుక్కలను షెల్టర్ హోమ్స్(shelter homes)కు తరలించి తగిన సంరక్షణ ఇవ్వాలి. జాతీయ, రాష్ట్ర రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా రోడ్ల నుంచి తొలగించి షెల్టర్ హోమ్స్‌కి తరలించాలి.కుక్కలు దేవుడు ఏరుకు కానీ మరి ట్రైన్ లో ఎక్కే హిజ్రా లను మరియు రహదారిలో దోపిడీ చేస్తున్న టోల్ల్గాటే వ్యవస్థను ఎలా మారుస్తారు అని , రహదారుల లో ఉన్న లోపాలు కనపడవు కానీ దారిలో పోయే జంతువులూ కన్నపడుతున్నయ అని ప్రజలు అడుగుతున్నారు.
సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్ఏఐ(NHAI) తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు అత్యవసరమని ధర్మాసనం పేర్కొంది.

