Supreme Court of India కీలక తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకేతర మతాల్లోకి మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హోదాను కోల్పోతారని స్పష్టం చేసింది.
Andhra Pradesh High Court ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, క్రైస్తవ మతంలోకి మారి ఆ మతాన్ని ఆచరించే వ్యక్తిని ఎస్సీ వర్గానికి చెందినవాడిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.మతమార్పిడి జరిగిన వెంటనే SC హోదా పూర్తిగా రద్దవుతుందని, రాజ్యాంగ పరిరక్షణలు కూడా వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
