తమిళనాడులోని 40కి పైగా రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి M.K stalin నేతృత్వంలో, ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే నిర్ణయం తీసుకున్నాయి.
చెన్నైలో జరిగిన బహు పార్టీ సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సవరణ చేపట్టడం ఓటర్ల హక్కులను మరియు ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పార్టీలు ECI త్వరితగతిన, కేంద్ర ప్రభావంలో వ్యవహరిస్తోందని ఆరోపించాయి.ఈ సమావేశానికి AIADMK మరియు BJP జరుకాలేదు. ఈ నిర్ణయం తమిళనాడులో ఎన్నికల పారదర్శకత, ఓటర్ల రక్షణపై పెద్ద న్యాయపోరాటానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.

