బ్యాంకులు లేదా ఫైనాన్స్ యాప్‌లలో లోన్ తీసుకున్న సామాన్యులను వేధిస్తున్న రికవరీ ఏజెంట్లకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అప్పు కట్టలేదనే నెపంతో బాధితులను మానసికంగా వేధించడం, పరువు తీయడం వంటి చర్యలకు పాల్పడితే బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసే అధికారం RBI కి ఉందని హెచ్చరించింది.

రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల ముందు, రాత్రి 7 గంటల తర్వాత ఫోన్ చేయకూడదు. బాధితుల అనుమతి లేకుండా ఇంటికి రాకూడదు.’శాంతి ప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్’ కేసులో వేధింపులకు గురైన బాధితుడికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని బ్యాంకును కోర్టు ఆదేశించింది. రికవరీ పనులను బయటి ఏజెన్సీలకు (Outsource) ఇచ్చినంత మాత్రాన బ్యాంకులు బాధ్యత నుంచి తప్పుకోలేవు. ఏజెంట్ల అక్రమాలకు బ్యాంకులే పూర్తి బాధ్యత వహించాలి. ఏజెంట్లు బూతులు తిడితే BNS సెక్షన్ 296, బెదిరింపులకు పాల్పడితే BNS సెక్షన్ 351 కింద పోలీసులు కేసులు నమోదు చేయవచ్చు.
“అప్పు తీసుకోవడం కేవలం ఒక సివిల్ ఒప్పందం మాత్రమే తప్ప నేరం కాదు” అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం స్పష్టం చేసింది.
