సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

March 14, 2026 5:38 PM

జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ Tejas Nand Lal Pawar తెలిపారు.

గ్యాస్ ఏజెన్సీలు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,15,509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 17,647 డొమెస్టిక్ సిలిండర్లు, 552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లోనే డెలివరీ జరుగుతుందని తెలిపారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.గృహ అవసరాల కోసం ఇచ్చే గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగించినా లేదా ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media