సూర్యాపేటలో ప్రేమోన్మాది సుత్తితో స్పందన LAW విద్యార్థినిపై దాడి

February 20, 2026 9:45 AM

జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్‌లో గురువారం ఒక ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతుందనే కక్షతో, ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి సుత్తితో తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన బోయిండ్ల మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన (లా విద్యార్థిని) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల యువతి అతడిని దూరం పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె తన సోదరి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మహేష్, ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి వెళ్లి సుత్తితో దాడి చేశాడు.బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువతిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media