పల్నాడు TDP నేతపై హత్యాయత్నం కాసు మహేష్ రెడ్డిపై ఆరోపణ

February 26, 2026 11:16 AM

గురజాల మండలం తేలుకుట్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలుపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పులిపాడు నుంచి ధైద వెళ్లే రోడ్డుపై ఏడుకొండలు ప్రయాణిస్తున్న బైకును అడ్డగించిన దుండగులు, ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో ఏడుకొండలు రెండు కాళ్లు విరిగిపోయాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణం వెనుక మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రోత్సాహం ఉందని నాగార్జున సాగర్ కుడి కాలువ చైర్మన్ పులుకూరి కాంతారావు ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, కాసు మహేష్ రెడ్డి మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media