రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ విమర్శించారు. గురువారం టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీకి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.

రాయలసీమ లిఫ్ట్ పనులు వైసీపీ హయాంలోనే ఆగిపోయాయని, ఎన్జీటీ స్టే వచ్చినప్పుడు సరైన వాదనలు వినిపించలేకపోయారని ఆరోపించారు. 2019–24 మధ్య భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ రాయలసీమ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.ప్రాజెక్టుల పేరుతో అవినీతి జరిగిందని, 102 ప్రాజెక్టుల పనులను రద్దు చేశారని, డ్రిప్ ఇరిగేషన్ నిలిపివేసి రైతులకు నష్టం కలిగించారని విమర్శించారు.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, వైసీపీ నాయకులు కూడా ముందుకు రావాలని మద్దిపట్ల సవాల్ విసిరారు.

