S.C MLAలపై వివక్ష? TDP MLA థామస్ సంచలన వ్యాఖ్యలు

April 24, 2026 5:05 PM

టీడీపీ ఎమ్మెల్యే Thomas చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత జరుగుతోందని ఆయన ఆరోపించారు.

“గెలిపించేటప్పుడు అవసరం.. కానీ అధికారంలో ఉండకూడదా?” అంటూ ప్రశ్నించిన థామస్, ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కొందరిలో ఎస్సీల పట్ల చులకన భావం ఉందని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.“ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి కానీ అధికారంలో మాత్రం ఉండకూడదా? మేము బానిసలా ఉండాలా?” అంటూ ఆయన నిలదీశారు.ఇతర కులాలకు చెందిన ఎమ్మెల్యేలు తప్పులు చేయరా అని ప్రశ్నిస్తూ, ఎస్సీలు బానిసలుగా ఉండాలనే భావన సరైంది కాదని స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media