చట్టాన్ని గౌరవించండి TDP శ్రేణులకు పల్లా శ్రీనివాసరావు పిలుపు

February 3, 2026 12:20 PM

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు మంగళవారం ఆయన పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గత ఐదేళ్ల YSRCP అరాచక పాలనను మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎదిరించామని, ఇప్పుడు మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని పల్లా స్పష్టం చేశారు. సోషల్ మీడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు లోనుకావద్దని సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి ₹1,088 కోట్లు, పోలవరానికి ₹3,320 కోట్లు కేటాయించడం స్వర్ణాంధ్ర-2047 దిశగా గొప్ప ముందడుగు అని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లకు పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల ఏపీ త్వరలోనే గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుతుందని, ఇది చంద్రబాబు గారి దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు గారికి ED (ఈడీ) మరియు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా వైసీపీ కుట్రలు బట్టబయలయ్యాయని, సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. CM చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ వివాదం నుండి దృష్టి మళ్లించేందుకే వైసీపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media