జమ్మలమడుగులో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన బిర్రు సంతోష్‌కు ఘన సన్మానం జరిగింది. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివేకానంద జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

దిగువపట్నం కాలనీకి చెందిన దళిత నాయకుడు సంతోష్‌కు రాష్ట్ర స్థాయి పదవి లభించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు రాజకీయాల్లో మొదటిసారి ఒక దళితుడికి టిడిపి రాష్ట్ర పదవి లభించడాన్ని స్వాగతిస్తూ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

