తెలంగాణలో 317 జీవో కింద బదిలీలు కోల్పోయిన ఉపాధ్యాయుల సమస్య పరిష్కార దిశగా సాగుతోంది. ఆదివారం వరకు 6,500 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ తెలిపింది.
ఈ దరఖాస్తులను జిల్లా విద్యాధికారులు పరిశీలిస్తున్నారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
అయితే సుమారు 50 శాతం దరఖాస్తులకే అర్హత లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
టీచర్లు త్వరితగతిన బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
