Tekkaliలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి Kinjarapu Atchannaidu ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా మండలి సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిత్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల సమగ్ర అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామిక రంగాల్లో ఎదగాలని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు రుణాలు అందించి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు.
అనంతరం మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్ రుణాల కింద రూ.328 కోట్ల నమూనా చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
