తెలంగాణలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. మహిళలకు భారీ అవకాశం

July 10, 2026 12:15 PM
Women applying for Telangana Anganwadi recruitment 2026.

రాష్ట్రవ్యాప్తంగా టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

జులై 27 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఇంటర్ అర్హత ఉన్న మహిళలకు ప్రాధాన్యం

తెలంగాణ: తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఉపాధి అవకాశాన్ని అందిస్తోంది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15,982 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

ఈ నియామకాలలో భాగంగా నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ ఆయా (హెల్పర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని ఐదు ICDS ప్రాజెక్టుల పరిధిలో 179 ఖాళీలు ఉన్నాయి.

ములుగు, నల్గొండ, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో కూడా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యార్హత

అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఖాళీ ఉన్న ప్రాంతంలో ఇంటర్ చదివిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పిస్తారు.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత

అంగన్‌వాడీ కేంద్రం ఉన్న పరిధిలో నివసించే స్థానిక వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం

జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. వెయిటేజీ ఈ విధంగా ఉంటుంది.

  • ఇంటర్మీడియట్ మార్కులు – 70 మార్కులు
  • అనాథలకు – 10 మార్కులు
  • వితంతువులకు – 5 మార్కులు
  • దివ్యాంగులకు – 5 మార్కులు
  • ఇంటర్వ్యూ – 10 మార్కులు

దరఖాస్తు చివరి తేదీ

అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 27, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. విద్యార్హత, నివాసం, కుల ధ్రువీకరణ పత్రాలతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది మహిళలకు తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media