తెలంగాణ caste survey: అగ్రవర్ణాల చేతుల్లోనే భూములు

April 18, 2026 11:23 AM

తెలంగాణలో భూమి యాజమాన్యంపై కుల ఆధారిత అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని తాజా సామాజిక-ఆర్థిక కుల సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో జనాభాలో 4.8% ఉన్న రెడ్డి వర్గం సుమారు 13.5% భూమిని కలిగి ఉండగా, 5.7% జనాభా ఉన్న యాదవ వర్గం 8.7% భూమిని కలిగి ఉందని నివేదిక పేర్కొంది.

ఈ సర్వే ప్రకారం, రాష్ట్రంలో కుటుంబానికి సగటు నీటి పారుదల భూమి 0.7 ఎకరాలు మాత్రమే ఉండగా, రెడ్డి, వెలమ, బీసీ-బి పెరిక వంటి కొన్ని వర్గాలు మాత్రమే ఈ సగటు కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నాయని వెల్లడైంది.

నివేదికలో పేర్కొన్నట్లు, చారిత్రకంగా భూముల సమీకరణలో ముందంజలో ఉన్న పై వర్గాలు ఇప్పటికీ అధిక భూములు, ఆస్తులు కలిగి ఉండటం వల్ల ఆర్థికంగా బలంగా నిలుస్తున్నాయి. మరోవైపు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సమాజాల వంటి వెనుకబడిన వర్గాలు భూముల యాజమాన్యంలో వెనుకబడి ఉన్నట్లు స్పష్టమైంది.“బ్రాహ్మణ సమాజంలో 16.4% కుటుంబాలకు కార్ల యాజమాన్యం ఉండటం రాష్ట్ర సగటుతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది — ఇది సమాజంలో ఉన్న సామాజిక-ఆర్థిక అసమానతలు మరియు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది.3.55 కోట్ల మంది వివరాలతో రూపొందించిన ఈ సర్వే తెలంగాణ సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలను స్పష్టంగా చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భూమి, ఆస్తుల పంపిణీలో సమానత్వం తీసుకురావడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media