తెలంగాణ: తెలంగాణ సీఐడీ పోలీసులు సంచలన ఆపరేషన్ నిర్వహించి రూ.100 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ కేసును ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
కరీంనగర్లో నమోదైన కేసు ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఓ బెట్టింగ్ యాప్లో రూ.6 లక్షలు కోల్పోయిన బాధితుడు మృతి చెందడంతో ఈ వ్యవహారం బయటపడింది.
దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో తెలంగాణ సీఐడీ సోదాలు నిర్వహించింది. ఓ యాప్ కేంద్రంగా ఈ మోసం సాగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది నిందితులను సీఐడీ గుర్తించింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.



