ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ MEET: రెండేళ్ల పాలనపై ఖర్గే

February 20, 2026 9:55 AM

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమీక్షా సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరై ప్రభుత్వ పనితీరుపై చర్చించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల అమలు, పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర నివేదికను అధిష్టానానికి సమర్పించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయంపై ఖర్గే హర్షం వ్యక్తం చేశారు.రాజ్యసభ స్థానాల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను రాహుల్ గాంధీ, ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media