తెలంగాణ కొత్త DGPగా CV Anand ?

April 25, 2026 11:37 AM

తెలంగాణలో కొత్త డీజీపీ నియామకంపై స్పష్టత రానుంది. 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి C V Anandను తదుపరి డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

ప్రస్తుత డీజీపీ Shivadhar Reddy ఈ నెల 30న పదవీ విరమణ పొందనుండటంతో, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త నియామకంపై ఉత్తర్వులు జారీ చేయనుంది.DGP పోస్టుకు అర్హులైన అధికారుల జాబితాను UPSC ఇప్పటికే పంపించింది. ఇందులో సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి.ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ కాగా, ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన అధికారుల బదిలీల నేపథ్యంలో ఆయననే డీజీపీగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media