తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ రాణి కుముదిని ప్రకటించారు. ఈ ప్రకటనతో మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
నామినేషన్ల ప్రారంభం: జనవరి 28, 2026.
నామినేషన్ల ముగింపు: జనవరి 30, 2026.
స్క్రూటినీ (పరిశీలన): జనవరి 31, 2026.
నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 3, 2026.
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026.
కౌంటింగ్ & ఫలితాలు: ఫిబ్రవరి 13, 2026.
రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ కోరారు.
