విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ప్రైవేట్ స్కూళ్లపై ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు!

August 21, 2026 12:07 PM
Telangana private school online complaint monitoring system

ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం

తెలంగాణ:తెలంగాణలో private school కు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఇక సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.

ఇందుకోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

మొబైల్ నంబర్‌తో లాగిన్.. OTP ద్వారా

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలంటే ముందుగా మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో సిస్టమ్‌లోకి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సమస్య, నిబంధనల ఉల్లంఘన లేదా ఇతర ఫిర్యాదు వివరాలను నమోదు చేయవచ్చు.

గతంలో ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే సంబంధిత విద్యాశాఖ కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది.

కొత్త విధానంతో ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం కలిగింది.

ఫిర్యాదు స్టేటస్ కూడా ఆన్‌లైన్‌లోనే

ఫిర్యాదు చేసిన తర్వాత దాని పురోగతిని కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

ఫిర్యాదు సమయంలో వచ్చే గ్రీవెన్స్ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ఫిర్యాదు ప్రస్తుత స్థితిని చెక్ చేయవచ్చు.

దీంతో అధికారులు తీసుకున్న చర్యలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

నిజమైన సమస్యలనే నమోదు చేయాలి

ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమస్యలను కొత్త ఆన్‌లైన్ సదుపాయం ద్వారా విద్యాశాఖ దృష్టికి తీసుకురావచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ తెలిపారు.

ఫిర్యాదులు చేసేటప్పుడు సరైన, వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు.

ఆధారరహిత లేదా తప్పుడు ఫిర్యాదులకు బదులుగా నిజమైన సమస్యలను స్పష్టమైన వివరాలతో నమోదు చేయాలని కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media