హైదరాబాద్‌ను ఢిల్లీలా కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల నుంచి కాపాడేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికను CM రేవంత్ ప్రకటించారు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల మాదిరిగా కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్‌లో రాకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.రాష్ట్రాన్ని క్యూర్ (సేవలు), ప్యూర్ (తయారీ), రేర్ (వ్యవసాయం) అనే మూడు జోన్లుగా విభజించినట్లు చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓఆర్ఆర్ వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించి, నగర కేంద్ర ప్రాంతాన్ని నివాసయోగ్యంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.స్మార్ట్ గవర్నెన్స్‌తో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం పేర్కొన్నారు.
