RTC చర్చలు విఫలం… అర్ధరాత్రి నుంచి సమ్మెకు సిద్ధం

April 22, 2026 10:17 AM

Telangana State Road Transport Corporation (TSRTC) సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ మరియు RTC Joint Action Committee (RTC JAC) మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు డెడ్‌లాక్‌లో ముగిశాయి.

దీంతో అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు RTC JAC పిలుపునిచ్చింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని యూనియన్ నేతలు ఆరోపించారు.

మరోవైపు ప్రజా రవాణా సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.ప్రభుత్వం చివరి నిమిషంలో చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం సమ్మెకు రంగం సిద్ధమైందని వర్గాలు తెలిపాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media