ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారనే కోపంతో ఓ నర్సు ఘాతుకానికి ఒడిగట్టింది. తన ఇష్టానికి విరుద్ధంగా వేరే సంబంధం చూస్తున్నారన్న కక్షతో, పని చేస్తున్న ఆసుపత్రి నుంచి విషపూరిత ఇంజక్షన్లు తెచ్చి కన్నవారిని పొట్టనబెట్టుకుంది.

నిందితురాలు సురేఖ వృత్తిరీత్యా నర్సు. తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. తన తల్లిదండ్రులకు బలవంతంగా విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి, వారు మరణించేలా చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణలో సురేఖ చేసిన ఘాతుకాన్ని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
