సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు.
పటాన్ చెరు, ఇస్నాపూర్ అతి వేగంగా వచ్చిన ఒక కారు ముందు వెళుతున్న మరో కారును, ఆ తర్వాత ఒక బైక్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
