మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేష్‌ను రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక విభాగం (ACB) అధికారులు రంగంలోకి దూకి పట్టుకున్నారు. అకస్మాత్తుగా ఏసీబీ బృందం చేరుకోవడంతో ఎస్సై రాజేష్ పంట పొలాల దిశగా పారిపోవడానికి ప్రయత్నించినా, అధికారులు వెంటాడి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సై అరెస్టు వార్త గ్రామంలో తెలిసిన వెంటనే ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎస్సై రాజేష్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఏసీబీ అధికారులు అక్కడ విచారణ కొనసాగించారు.

