నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో, హైదరాబాద్–విజయవాడ రహదారి (NH-65)పై ఇన్నోవా కారు యూ-టర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి మంటలు చెలరేగింది.
కారు లో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు అప్రమత్తంగా బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరి మంటలను ఆర్పారు.
కారు రోడ్డుపై పడివుండటం వల్ల హైవేపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, రహదారి సిబ్బందితో కలిసి వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
