Telengana :కాంగ్రెస్–బీఆర్‌ఎస్ తెలంగాణకు ద్రోహం చేశాయి: RLD రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌కుమార్

November 25, 2025 10:25 AM

నిజామాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశాయని విమర్శించారు.

విద్య, వైద్యం, ఉపాధి రంగాలు ఈ పార్టీల పాలనలో దెబ్బతిన్నాయని, ఇంకా కనీసం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుళజన రాజకీయ అధికారం సాధ్యమని, ఆర్‌ఎల్‌డీ యువతను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహిస్తుందన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడం ఇవి అన్నీ అసమర్థ పరిపాలన ఫలితమని దిలీప్‌కుమార్ విమర్శించారు.

బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media