డమ్మీ నామినేషన్ వ్యూహం వికటించడంతో, సర్పంచ్ ఎన్నికల్లో భార్యాభర్తలు ఒకరికొకరు పోటీ పడాల్సిన అనూహ్య పరిస్థితి భూపాలపల్లి జిల్లా గనపురం (ములుగు) మండలం గొల్లపల్లి గ్రామంలో నెలకొంది.
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అరుణ్ ప్రధానంగా సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. అరుణ్ భార్య గీతాంజలి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు సమయానికి గీతాంజలి అందుబాటులో లేకపోవడంతో, ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం సాధ్యం కాలేదు. దీంతో భర్త అరుణ్‌తో పాటు భార్య గీతాంజలి కూడా తుది అభ్యర్థుల జాబితాలో చేరారు. ఇప్పుడు గొల్లపల్లి సర్పంచ్ స్థానానికి ఈ దంపతులిద్దరూ పోటీ పడనున్నారు.,,BNS media
