
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామ శివారులోని మానేరు నది పైన గల చెక్ డ్యాం కూల్చివేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
