తెలంగాణ ఉద్యమ స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఓయూకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు, అభిమానం. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని అభివృద్ధికి బాటలు వేసేందుకు వచ్చాను.P.V నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను ఓయూ అందించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓయూ ముందు నిలిచింది.తెలంగాణ వస్తే తమ తమ్ముళ్లు ఫామ్ హౌస్‌లు, ఆస్తులు అడగలేదు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు. ప్రజా ప్రభుత్వంలో వాటిని అందిస్తున్నాం. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, విదేశీ భాష రాకపోవచ్చు కానీ, తనకు పేదవాడి మనసు చదవడం వచ్చు, పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చని విమర్శలకు బదులిచ్చారు.రెండేళ్లలో జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాం; బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించాం; ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం చేశాం; బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం.
O.U ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేటాయింపు.వెనుకబాటుతనం పోవాలంటే విద్యే మార్గం. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించాం.యువత నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (ఆనంద్ మహీంద్రా చైర్‌పర్సన్‌గా), యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (2036 ఒలింపిక్స్ లక్ష్యంగా) ఏర్పాటు చేశాం.యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.చివరిగా, విద్యార్థులు రాజకీయాల ఉచ్చులో పడకుండా, నిబద్ధతతో కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
