రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనుల పరిశీలన సందర్భంగా పెద్ద ప్రమాదం తప్పింది.
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా, వారు నిలిచిన బేసిమెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది.
సమయస్ఫూర్తిగా స్పందించిన అధికారులు, నాయకులు వారిని వెంటనే సురక్షితంగా వెనక్కి తరలించడంతో ప్రమాదం తప్పింది.నలుగురు నిల్చుంటే కూలిపోయే ఫ్లాట్స్ ప్రజాప్రతినిధులు వచ్చిందే కుంగిపోయిన స్థలాన్ని చూడడానికి కానీ వారు నుంచున్నాక వారు వుండే స్థలం కూడా కుంగిపోవడం మన ప్రభుత్వ కాంట్రాక్టర్ల యొక్క నాణ్యతను ప్రశ్నిస్తుంది .