Telengana :DGP కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు

December 4, 2025 11:23 AM

కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై (Sub-Inspector) అయ్యప్ప మాల ధరించినందుకు గాను ఉన్నతాధికారులు మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

అయ్యప్ప మాల ధరించిన ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అయ్యప్ప స్వాములు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

ఎస్సైకి ఇచ్చిన మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్వాములు డిమాండ్ చేశారు.

డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, స్వాములకు మధ్య వాగ్వాదం మరియు తోపులాట జరిగింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న అయ్యప్ప స్వాములను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media