రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతూ, బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) తెలంగాణ రాష్ట్ర శాఖ గురువారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి వినతిపత్రం సమర్పించింది

1)అక్రిడిటేషన్లలో జాప్యం,రెండేళ్లుగా జరుగుతున్న అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో జాప్యాన్ని వెంటనే సరిచేయాలి.
2)డిజిటల్ మీడియాకు గుర్తింపు,”కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లలో డిజిటల్, వెబ్ మీడియాకు అవకాశం కల్పించిన నేపథ్యంలో, తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ పాలసీలోనూ డిజిటల్, వెబ్ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి.”
3)ఆరోగ్య బీమా అమలులో నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలి.
4)నివేశన స్థలాలు,”అనేక జిల్లాల్లో ఏళ్ల తరబడి కొలిక్కి రాని జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యను పరిష్కరించి, సొంతింటి కలను నెరవేర్చాలి.”
5)రాయితీలు,”హైదరాబాద్ జర్నలిస్టులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం, జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద రాయితీ కల్పించాలి.”
6)స్థానిక పత్రికల మనుగడ,స్థానిక దినపత్రికల మనుగడ కోసం సమాచార శాఖ కార్యాలయంలో ఎన్‌ప్యానల్‌మెంట్ వేగవంతం చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్ కార్డు పెంచాలి.

