సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా DR M. రమేష్, IPS (2005 బ్యాచ్) శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీపీగా ఉన్న అవినాష్ మహంతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో రమేష్ IGP (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్) గా పనిచేశారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ మాట్లాడుతూ చట్టబద్ధమైన పాలనను అందించడమే తమ తొలి బాధ్యతని పేర్కొన్నారు. పారదర్శకత, వృత్తి నైపుణ్యం మరియు ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పోలీసింగ్ ఉంటుందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం శాంతిభద్రతలను కాపాడటమే ప్రధాన లక్ష్యమని, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడతామని చెప్పారు.
