బ్రీత్ టెస్ట్ మాత్రమే సరిపోదు – రక్త, మూత్ర పరీక్షలు తప్పనిసరి: తెలంగాణ హైకోర్టు

October 30, 2025 12:28 PM

బ్రీత్ ఎనలైజర్‌ ఫలితాలు మాత్రమే ఆధారంగా మద్యం సేవనాన్ని తుది నిర్ధారణగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఈ పరీక్ష ఆధారంగా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని కోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది.టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్ ఎ. వెంకటి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ నమవరపు రాజేశ్వర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించి నిరసనలో పాల్గొన్నారని ఆరోపణలతో ఆర్టీసీ యాజమాన్యం వెంకటిని తొలగించింది.కోర్టు తీర్పులో, బ్రీత్ టెస్ట్ ఫలితాలు కేవలం ప్రాథమిక ఆధారాలు మాత్రమే, తుది నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలు తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. కేవలం శ్వాస పరీక్ష ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media