క్రెడిట్ కార్డ్ మోసాల పెరుగుతున్న ప్రమాదం గురించి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఫిషింగ్, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్, మాల్వేర్ యాప్‌లు వంటి వివిధ మార్గాల ద్వారా మోసగాళ్లు బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారని డీసీపీ, సైబర్ క్రైమ్స్ తెలిపారు.
ఫిషింగ్/నకిలీ వెబ్‌పేజీలు: ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా నకిలీ లింకులు పంపి కార్డ్/OTP వివరాలు సేకరించడం. ఫేక్ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయించి, కార్డ్ వివరాలు అడగడం. లిమిట్ పెంచుతామని చెప్పి, కార్డ్ డీటైల్స్ లేదా రిమోట్ యాక్సెస్ యాప్‌లు (మాల్వేర్) డౌన్లోడ్ చేయమని చెప్పడం. బాధితుడి నంబర్‌ను అధీనంలోకి తీసుకుని, OTPలను దొంగిలించడం.

POLICE (Safety Instructions)
OTP, PIN, CVV, పూర్తి కార్డ్ నంబర్ వంటి వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు వీటిని అడగవు. రీఫండ్ లేదా ట్రాన్సాక్షన్ ఫిక్స్ చేస్తామని చెప్పి యాప్ డౌన్లోడ్ చేయమనే కాల్స్ వస్తే వెంటనే కట్ చేయండి.
కార్డ్ బ్లాక్ చేయడానికి లేదా ఫిర్యాదు చేయడానికి కార్డ్ వెనుక ఉన్న అధికారిక నంబర్ లేదా బ్యాంక్ వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి. మోసాలకు గురైతే తక్షణమే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి.
