పెండింగ్ చలాన్ల విషయంలో కాజీపేట ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో కాజీపేట చర్చి వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా, రికార్డు స్థాయిలో చలాన్లు ఉన్న బైక్ను గుర్తించారు.
కాజీపేట చర్చి కూడలి (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి),ఒక బైక్పై ఏకంగా 103 పెండింగ్ చవాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ చలాన్ల మొత్తం ₹25,105/- గా ఉంది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన తీవ్రత దృష్ట్యా, పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు టీఐ వెంకన్న, ఎస్సైలు కనక చంద్రం, సంపత్ ఈ తనిఖీలను పర్యవేక్షించారు.
