తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు, పొంగులేటి రాఘవపై భూ కబ్జా కేసు నమోదైంది. రూ. 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి యత్నించారనే ఆరోపణలు రావడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, “అవును నిజమే, నా కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయింది,” అని అంగీకరించారు.
నిందితుడు పొంగులేటి రాఘవ (మంత్రి కొడుకు), రాఘవ కన్స్ట్రక్షన్స్ గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లి.
నవంబర్ 30 అర్ధరాత్రి, రాఘవ కంపెనీకి చెందినవారు 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి, భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను జేసీబీలతో కూల్చివేశారు. అడ్డుకున్న స్థలం యజమానిపై దాడి చేశారు.
భూమిలో ఉన్న గోశాలను, షెడ్లను సైతం ధ్వంసం చేసినట్లు పల్లవి షా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పల్లవి షా ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు మరో ఐదుగురిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, “తప్పుంటే నా కొడుకైనా, నేనైనా శిక్ష అనుభవించక తప్పదు” అని స్పష్టం చేశారు.
