ఏరుగట్ల మండలం, దోమచందా గ్రామం ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ (30) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో దోమచందా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శ్రీకాంత్, అఖిల అనే యువతి గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే, అఖిలకు వేరే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు రోజు తనతో వచ్చేస్తానని అఖిల చెప్పడంతో శ్రీకాంత్ ఎదురుచూశాడు. కానీ, ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగుల మందు తాగాడు.
20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మరణించాడు
శ్రీకాంత్ మరణవార్త తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో, రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారని కుటుంబీకులు ఆరోపించారు.
