Telengana : POLICE కమిషనరేట్ వెబ్‌సైట్లు హ్యాక్

December 4, 2025 3:37 PM

తెలంగాణలో సైబర్ దుండగుల దాడితో కలకలం రేగింది. పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు దాడి చేశారు.

భద్రతా లోపాలను లక్ష్యంగా చేసుకొని సైబర్ దుండగులు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.

హ్యాకింగ్ జరిగిన వెంటనే రాష్ట్ర ఐటీ విభాగం స్పందించి, వెబ్‌సైట్ యాక్సెస్‌ను వెంటనే బ్లాక్ చేసింది.

సైబర్ క్రైమ్ విభాగం బృందాలు హ్యాకింగ్ ట్రయిల్‌ను ట్రేస్ చేస్తున్నాయి. ఈ దాడి దేశం వెలుపల నుంచే జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించడానికి, అధికారులు డేటా సేఫ్టీపై హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు అదనపు ఫైర్‌వాల్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
హ్యాకర్లను గుర్తించడానికి మరియు దాడికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు ముమ్మర విచారణ చేపట్టాయి


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media