Telengana గృహ నిర్మాణ విధానం – 2047: ORR వద్ద హౌసింగ్ యూనిట్లు

December 10, 2025 11:21 AM

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఇందుకోసం సమగ్రమైన గృహ నిర్మాణ విధానం రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో’ భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు.

అన్ని వర్గాల ప్రజలకు అనువైన ధరల్లో సొంతింటి వసతి కల్పించడం. ఆదాయంతో సంబంధం లేకుండా, ఆర్థికంగా సాధ్యమయ్యే, పర్యావరణ అనుకూలమైన, సాంకేతికత ఆధారిత సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) ఔటర్ రింగ్ రోడ్ (ORR) మరియు రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ తరహాలో ఇళ్లను నిర్మించనున్నారు. గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా 42 లక్షల ఇళ్లు, హౌసింగ్ బోర్డ్ ద్వారా 1 లక్ష ఇళ్లు నిర్మించారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

PLAN:

TCUR (కోర్ అర్బన్ ప్రాంతం): మురికివాడల పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో అద్దె గృహ నిర్మాణం.

PUR (పరి-అర్బన్ ప్రాంతం): ప్లాన్డ్ టౌన్‌షిప్‌లు, భారత్ సిటీ వంటి గ్రీన్‌ఫీల్డ్ శాటిలైట్ టౌన్‌లు.

RoS (మిగిలిన ప్రాంతాలు): చిన్న టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్‌లతో అనుసంధానించబడిన కార్మికుల గృహ వసతి.

సదస్సులో ప్రపంచ బ్యాంక్, రాంకీ, హడ్కో, క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media